లుక్ అవుట్ నోటీసులు జారీ
ఫోన్ ట్యాపింగ్ లో కీలక నేతలు
హైదరాబాద్ – ఎన్నికల వేళ తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో చోటు చేసుకున్న ఈ కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రతిపక్షాలకు చెందిన నేతలు, వారి కుటుంబీకులు, సినీ ప్రముఖులు, వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలకు సంబంధించి ఫోన్ ట్యాప్ చేసినట్లు గుర్తించారు.
ఈ విషయం డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో బయట పడింది. దీని వెనుక ప్రధాన కుట్రదారు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఉన్నట్లు తేలింది. ఆయనతో పాటు మాజీ ఆఫీసర్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ రాధా కిషన్ రావుపై లుక్ అవుట్ నోటీసులు జారీ అయ్యాయి.
ఈ కేసుకు ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్ రావును తేల్చారు. దీని వెనుక బడా రాజకీయ నేతలు ఉన్నట్లు సమాచారం. వారిలో ఒకరు మాజీ మంత్రిగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ప్రాంతీయ మీడియా ఛానెల్ కు చెందిన సీనియర్ ఎగ్జిక్యూటివ్ పై కూడా లుక్ అవుట్ జారీ కావడంతో బిగ్ షాక్ తగిలింది.
విచిత్రం ఏమిటంటే లుక్ అవుట్ నోటీసులు అందుకున్న ఆ ముగ్గురు విదేశాలలో ఉన్నారు.