NEWSTELANGANA

రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌లు క‌రువు

Share it with your family & friends

నిప్పులు చెరిగిన ఈట‌ల రాజేంద‌ర్

హైద‌రాబాద్ – భార‌తీయ జ‌న‌తా పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు, మ‌ల్కాజిగిరి ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల‌కు ముప్పు ఏర్ప‌డింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హోళీ సంబ‌రాలు కూడా చేసుకోలేని స్థితిలో ప్ర‌జ‌లు ఉన్నార‌ని వాపోయారు. అస‌లు రాష్ట్రంలో ప్ర‌భుత్వం అనేది ఒక‌టి ఉందా అన్న అనుమానం త‌న‌కు క‌లుగుతోంద‌న్నారు.

ఇదిలా ఉండ‌గా పండుగ సంద‌ర్బంగా ఉప్పల్ దగ్గర లోని చెంగిచెర్లలో హోళీ జరుపుకుంటున్న మహిళల పైన కొంత మంది గుండాలు దాడి చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప‌ర్యాట‌క శాఖ మంత్రి గంగాపురం కిష‌న్ రెడ్డితో క‌లిసి మీడియాతో మాట్లాడారు ఈటల రాజేంద‌ర్.

బాధిత కుటుంబాల‌కు బీజేపీ అండ‌గా ఉంటుంద‌ని హామీ ఇచ్చారు. దాడికి పాల్ప‌డిన వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ పోలీస్ స్టేష‌న్ కు వెళ్లినా ప‌ట్టించు కోలేద‌ని మండిప‌డ్డారు. ఖాకీలు ఏక‌పక్షంగా వ్య‌వ‌హ‌రించ‌డంపై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు ఈట‌ల రాజేంద‌ర్.

భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, హిందూ ధర్మాన్ని కాపాడిన అనేక సంస్థలు లేకపోయుంటే ఇంకొంత మంది మీద దాడి జరిగే ఆస్కారం ఉందన్నారు . ఇక‌నైనా ఏక‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించ‌డం మానుకోవాల‌ని సూచించారు.