దివ్య రథోత్సవంలో లోకేష్
స్వామిని దర్శించుకున్న నారా
మంగళగిరి – తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలుపొందాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటు వేయాలని కోరుతున్నారు.
ఇదే సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా పేరు పొందిన మంగళగిరిలో కొలువై ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి శ్రీవారి దివ్య రథోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరిగింది. భారీ ఎత్తున భక్తులు తరలి వచ్చారు. ప్రతి ఏటా మార్చి నెలలో రథోత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది.
ఈ తరుణంలో ఉత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు నారా లోకేష్. శ్రీమాన్ మాడభూషి వేదాంతాచార్యులు నేతృత్వంలో ఈ ఉత్సవం కొనసాగింది. నమో లక్ష్మీ నరసింమ స్వామి నామ స్మరణతో మంగళగిరి వీధులు హోరెత్తాయి.
ఉత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేసిన మంగళగిరి పద్మశాలీయ శ్రీ లక్ష్మీనరసింహస్వామి రథచక్రాల బృందం కమిటీ సభ్యులను అభినందిస్తున్నట్లు తెలిపారు నారా లోకేష్.