కుప్పంతో ఎడ తెగని బంధం
గుర్తు చేసుకున్న చంద్రబాబు
అమరావతి – తెలుగుదేశం పార్టీ చీఫ్, మజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కుప్పం గురించి ప్రశంసలు కురిపించారు. తన జీవితంలో రాజకీయ భిక్షను ప్రసాదించింది ఈ ప్రాంతమేనని పేర్కొన్నారు.
కుప్పం పేరు చెబితే తన పేరు ముందుగా గుర్తుకు వస్తుందన్నారు. ఇవాళ ప్రపంచ వ్యాప్తంగా తన పేరు సెర్చ్ చేస్తే ముందుగా గుర్తుకు వచ్చేది , గూగుల్ లో కనిపించేది కుప్పమేనని స్పష్టం చేశారు నారా చంద్రబాబు నాయుడు.
తను పుట్టిన ఈ నేలతో 35 ఏళ్లకు పైగా అనుబంధం ఉందని చెప్పారు టీడీపీ చీఫ్. తాను ఎక్కడికి వెళ్లినా ఈ కుప్పంను మరిచి పోలేనంటూ స్పష్టం చేశారు. మహిళలందరినీ ప్రపంచంతో పోటీ పడేలా చేస్తానని అన్నారు నారా చంద్రబాబు నాయుడు. ప్రధానంగా పాడి పరిశ్రమను ఎంచుకున్నట్లు తెలిపారు.
ఇంటికి రెండు ఆవులు ఇస్తానంటే ఆనాడు తనను ఎగతాళి చేశారని కానీ ఇవాళ తాను ప్రతిపాదించిన దానికే ప్రతి ఒక్కరు ఓకే చెబుతున్నారని అన్నారు టీడీపీ చీఫ్, మాజీ సీఎం.