తిలక్ రెస్టారెంట్ లో వెంకయ్య
రుచికరమైన భోజనం అద్భుతం
అమరావతి – మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు సంచలనంగా మారారు. ఆయన అనుకోకుండా జర్నీ సమయంలో తిలక్ కిచెన్ రెస్టారెంట్ కు చేరుకున్నారు. ఈ సందర్బంగా తిలక్ ను గుర్తు చేసుకున్నారు.
తిలక్ కిచెన్ రెస్టారెంట్ ను తాను మరిచి పోలేనని పేర్కొన్నారు. ఈ సందర్బంగా తాను భోజనం చేస్తున్న ఫోటోలను స్వయంగా వెంకయ్య నాయుడు ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తిలక్ గురించి ఈ సందర్బంగా గుర్తు చేసుకున్నారు. తిలక్ తనకు కావాల్సిన స్నేహితుడని పేర్కొన్నారు.
ఈ సందర్బంగా తుమ్మల రంగారావుతో కలిసి చక్కటి భోజనం చేశానని తెలిపారు ముప్పవరపు వెంకయ్య నాయుడు. ఆహారం అద్భుతంగా ఉందని, ప్రత్యేకంగా సర్వీస్ అందించిన విధానం గుర్తు పెట్టుకునేలా ఉందని స్పష్టం చేశారు మాజీ ఉప రాష్ట్రపతి.
ఏపీలో పర్యటించే వారు, ప్రయాణీకులు, భక్తులు విధిగా తిలక్ కిచెన్ రెస్టారెంట్ ను సందర్శించాలని సూచించారు. ఇది పూర్తిగా ఇంటిని తలపించేలా ఉందని కితాబు ఇచ్చారు ముప్పవరపు వెంకయ్య నాయుడు.