సుప్రియా కామెంట్స్ కంగనా సీరియస్
నటిగా అన్ని పాత్రలు చేయాల్సిందే
ముంబై – ప్రముఖ వివాదాస్పద నటి కంగనా రనౌత్ నిప్పులు చెరిగారు. తన పట్ల వ్యక్తిగతంగా కామెంట్స్ చేయడాన్ని తప్పు పట్టారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. మంగళవారం కంగనా రనౌత్ మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకురాలు సుప్రియా శ్రీనాటే తన గురించి, వ్యక్తిగత జీవితం గురించి, పాత్రలపై చులకన చేసి మాట్లాడటం తన వ్యక్తిత్వాన్ని తెలియ చేస్తుందన్నారు కంగనా రనౌత్. తానేమిటో , తన వ్యక్తిత్వం ఏమిటో ఈ దేశ ప్రజలందరికీ తెలుసన్నారు.
తాను ముక్కు సూటిగా మాట్లాడతానని, తను కూడా ఓ మహిళేనన్న సంగతి మరిచి పోతే ఎలా అని ప్రశ్నించారు. నా 20 ఏళ్ల సినీ కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలను పోషించడం జరిగిందని చెప్పారు కంగనా రనౌత్.
ఇది తన వృత్తి అని, తాను తన పట్ల వ్యక్తిగతంగా ఏనాడూ అనుచిత వ్యాఖ్యలు చేయలేదని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎందుకు సుప్రియా పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తున్నదో చెప్పాలని డిమాండ్ చేశారు వివాదాస్పద నటి.