మోదీ నిర్వాకం రౌత్ ఆగ్రహం
మెగా ర్యాలీ విజయం ఖాయం
ముంబై – శివసేన (యుబీటీ) పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఆప్ చీఫ్ , ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ను అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. దేశంలో మోదీ తన పరివారం, బీజేపీ, దాని అనుబంధ సంస్థలు మాత్రమే ఉండాలని కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇది పూర్తిగా కక్ష సాధింపు ధోరణి తప్ప మరోటి కాదన్నారు.
కేజ్రీవాల్ అరెస్ట్ తో మోదీలో భయం మొదలైందన్నారు. ఆనాడు గాంధీ , నెహ్రూ కూడా జైలులో ఉన్న వారేనని పేర్కొన్నారు. ఎన్ని కేసులు నమోదు చేసినా లేదా భయ భ్రాంతులకు గురి చేసినా , జైలు పాలు చేసినా భయపడే ప్రసక్తి లేదని హెచ్చరించారు సంజయ్ రౌత్.
ఆప్ అధినేతను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు . న్యూఢిల్లీలో కూటమి ఆధ్వర్యంలో భారీ మెగా ర్యాలీ చేపట్టనున్నట్లు చెప్పారు. చారిత్రాత్మకమైన రాం లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు వెల్లడించారు సంజయ్ రౌత్.
అరవింద్ కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం వల్ల బీజేపీకి నష్టం తప్ప లాభం ఏమీ ఉండదన్నారు. కూటమికి మరింత మేలు జరుగుతుందన్నారు .