DEVOTIONAL

ఆధ్యాత్మిక ఉత్స‌వం ఆనందం

Share it with your family & friends

సీనియ‌ర్ ఐఏఎస్ స్మితా స‌బ‌ర్వాల్

హైదరాబాద్ – జీవ‌న ప్ర‌యాణంలో ఆధ్యాత్మిక‌త అనేది క‌లిగి ఉంటే ఇబ్బందులంటూ ఉండ‌వ‌ని స్ప‌ష్టం చేశారు సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ , తెలంగాణ రాష్ట్ర ఆర్థిక ముఖ్య కార్య‌ద‌ర్శి స్మితా స‌బ‌ర్వాల్. హోళీ ప‌ర్వ దినాన్ని పుర‌స్క‌రించుకుని ఇస్కాన్ ఆధ్వ‌ర్యంలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా చిన్నారులు, విద్యార్థుల‌తో భేటీ అయ్యారు. వారితో ముచ్చ‌టించారు. వారి మ‌నోభావాల‌ను అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేశారు.

ఆధ్యాత్మిక‌, సాంస్కృతిక ఉత్స‌వానికి త‌న‌ను ఆహ్వానించ‌డం త‌ను మ‌రిచి పోలేన‌ని స్ప‌ష్టం చేశారు స్మితా స‌బ‌ర్వాల్. ఈ ప్ర‌త్యేక రోజున పాల్గొన‌డం సంతోషం క‌లిగించింద‌ని పేర్కొన్నారు. జీవితంలో ఎద‌గాలంటే ముందు కుటుంబంలో ఆధ్యాత్మిక‌త అనేది భాగంగా ఉంటుంద‌న్నారు. ఇదే స‌మ‌యంలో పిల్ల‌ల భ‌విష్య‌త్తు పూర్తిగా త‌ల్లిదండ్రుల పైనే ఉంటుందని స్ప‌ష్టం చేశారు స్మితా స‌బ‌ర్వాల్.

ఆధ్యాత్మిక‌త అనేది ఒక‌రు చెబితే రాద‌ని, అది స్వానుభ‌వంలో వ‌స్తుంద‌ని తెలిపారు. ఇది మ‌న జీవితంలో పూర్తిగా భాగం కావాల‌ని సూచించారు. ఎంత ఎత్తుకు ఎదిగినా మూలాలు మ‌రిచి పోకూడ‌ద‌ని సూచించారు .