రాజకీయ పార్టీలకు బిగ్ షాక్
ఇంటింటి ప్రచారంపై కామెంట్స్
అమరావతి – ఏపీలో ఎన్నికల సందర్భంగా 144 సెక్షన్ ఉందని స్పష్టం చేశారు ఇప్పటికే ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా. కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయా రాజకీయ పార్టీలు విధిగా ఇంటింటి ప్రచారం చేయాలంటే ముందస్తుగా ఎన్నికల సంఘంకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వాటిని పరిశీలించి అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు సీఈవో.
సార్వత్రిక ఎన్నికల్లో సభలు, సమావేశాలు, రోడ్ షోలు , ప్రదర్శనలు, ఇంటింటి ప్రచారానికి విధిగా అభ్యర్థులు ముందస్తుగా పర్మిషన్ తీసుకోవాలని చెప్పారు. లేక పోతే అనుమతి ఇచ్చే ప్రసక్తి లేదన్నారు. ఒకవేళ ఎలాంటి ముందస్తు అనుమతి తీసుకోకుండా ప్రచారం చేపట్టినట్లియితే వారి అభ్యర్థిత్వాన్ని బ్లాక్ లిస్టులో పెట్టడం జరుగుతుందని హెచ్చరించారు.
సమావేశానికి 48 గంటల ముందు సువిధ యాప్ లేదా నేరుగా రిటర్నింగ్ అధికారులకు దరఖాస్తు చేసు కోవాలంటూ పార్టీలకు లేఖ రాయడం జరిగిందని చెప్పారు ముఖేష్ కుమార్ మీనా. అంతే కాకుండా ప్రచార సామగ్రి అనుమతులు సీఈవో వద్ద తీసుకోవాలని సూచించారు., ఊరేగింపులు, ర్యాలీలకు జిల్లాల ఎన్నికల అధికారుల వద్ద పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందన్నారు.