SPORTS

ఐపీఎల్ మ్యాచ్ కు ప్ర‌త్యేక బ‌స్సులు

Share it with your family & friends

ప్ర‌క‌టించిన టీఎస్ఆర్టీసీ ఎండీ ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ – క్రికెట్ ప్రియుల‌కు ఖుష్ క‌బ‌ర్ చెప్పారు తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మేనేజింగ్ డైరెక్ట‌ర్ వీసీ స‌జ్జ‌నార్. మంగ‌ళ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం క్రికెట్ మేనియా దేశ వ్యాప్తంగా ఊపేస్తోంది. ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (ఐపీఎల్ ) 2024 ఛాంపియ‌న్ షిప్ కోసం పోటీలు జ‌రుగుతున్నాయి.

ఇందులో భాగంగా బీసీసీఐ ప్ర‌త్యేకించి హైద‌రాబాద్ లోని ఉప్ప‌ల్ స్టేడియంను ఎంపిక చేసింది. ఈ మేర‌కు భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది హైద‌రాబాద్ క్రికెట్ అసోసియేష‌న్. కాగా స్టేడియం వ‌ద్ద‌కు వెళ్లేందుకు గాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా టీఎస్ఆర్టీసీ నిర్ణ‌యం తీసుకుంద‌ని ఎండీ తెలిపారు.

బుధ‌వారం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ , ముంబై ఇండియ‌న్స్ మ‌ధ్య కీల‌క‌మైన ఐపీఎల్ లీగ్ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ మేర‌కు స్టేడియంకు హాజ‌ర‌య్యేందుకు గాను హైద‌రాబాద్ లోని అన్ని ప్ర‌ధాన కూడ‌ళ్ల నుంచి నేరుగా వెళ్లేందుకు ప్ర‌త్యేకించి 60 బ‌స్సుల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు స్ప‌ష్టం చేశారు ఎండీ.

సాయంత్రం 6 గంట‌ల నుండి రాత్రి మ్యాచ్ అయి పోయాక 11.30 గంట‌ల వ‌ర‌కు ఈ బస్సులు న‌డుస్తాయ‌ని వెల్ల‌డించారు.