ప‌ర్యాట‌క కేంద్రాలుగా ఏపీలోని గ్రామాలు

పిలుపునిచ్చిన డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : రాష్ట్రంలో విశిష్టతలు, ప్రత్యేకతలు కలిగిన గ్రామాలు ఎన్నో ఉన్నాయన్నారు ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. అయితే, పర్యాటకులు వాటిని చూడటానికి వెళ్ళినప్పుడు, అక్కడ సౌకర్యాల కొరత నిరాశకు గురిచేస్తుందని అన్నారు. ఫలితంగా చాలా మంది ఆసక్తి కోల్పోతున్నారని పేర్కొన్నారు. దీనికోసం పంచాయతీ రాజ్ అధికారులు ఒక ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ఆదేశించారు. ఈశాన్య రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు, వారు తమ ఇళ్లలోనే తగిన సౌకర్యాలు కల్పిస్తారని చెప్పారు అతిథులను దేవుళ్లలా ఆదరిస్తారని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాల్లో కూడా అలాంటి విధానాన్ని అమలు చేయాలని స్ప‌ష్టం చేశారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌.

కొన్ని ప్రాంతాలను పైలట్ ప్రాజెక్టులుగా ఎంచుకుని, అక్కడ పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఇలా అమలు చేస్తే, గ్రామాల రూపురేఖలు మారిపోతాయని అన్నారు. వారు కూడా ఆర్థికంగా బలోపేతం కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. పర్యావరణ పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేసి, పర్యాటకుల సంఖ్యను పెంచానల‌న్నారు. కర్నూలు జిల్లాలోని కృష్ణా నదీ లోయలు అత్యంత ప్రసిద్ధి చెందినవ‌ని పేర్కొన్నారు. పర్యాటకులు వీక్షించేందుకు వీలుగా వాటిని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేయాల‌న్నారు. నల్లమలలోని బైర్లూటి, నెల్లూరు జిల్లాలోని ఫ్లెమింగో పక్షి పెంపక కేంద్రాలు… రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో ఇటువంటి ప్రత్యేకతలను గుర్తించి, తదనుగుణంగా పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలని ఆదేశించారు.

  • Related Posts

    ప్ర‌పంచ స్థాయి పెట్టుబ‌డుల కేంద్రంగా తెలంగాణ : సీఎం

    హైద‌రాబాద్ : తెలంగాణను ప్రపంచ స్థాయి పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దాలని 2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి స్ప‌ష్టం చేశారు. బుధ‌వారం అమెజాన్ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమంలో…

    రాష్ట్ర ఎన్నిక‌ల అధికారిని క‌లిసిన జ‌ర్న‌లిస్టులు

    హైద‌రాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సి.సుదర్శన్ రెడ్డిని బుధ‌వారం కలిసింది ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఫ్రైడే ఈవెనింగ్ టీమ్. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలన్న దాని ప్రాముఖ్యతను, ప్రతి పౌరుడి అత్యంత పవిత్రమైన ప్రజాస్వామిక హక్కు అయిన ఓటు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *