బయటకు వస్తా నేనేంటో చూపిస్తా
బీఆర్ఎస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
న్యూఢిల్లీ – దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొని ప్రస్తుతం విచారణ ఎదుర్కొంటున్న మాజీ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆమె కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు.
తాను ఏ తప్పు చేయలేదన్నారు. కావాలని తనను ఇరికించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. అయితే తనకు తాత్కాలికంగా జైలు శిక్ష పడే ఛాన్స్ ఉందని అభిప్రాయపడ్డారు.
ఇది మనీ లాండరింగ్ కేసు కానే కాదన్నారు..ఇది కేవలం కక్ష సాధింపుతో కూడుకున్న రాజకీయ లాండరింగ్ కేసు అని ఆరోపించారు కల్వకుంట్ల కవిత. ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీలో చేరాడంటూ ఎద్దేవా చేశారు. మరో నిందితుడికి బీజేపీ టికెట్ ఇచ్చిందన్నారు.
ఇక మరో మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో కేంద్ర పార్టీకి రూ. 50 కోట్లు సమర్పించాడని , ఇక కేసు ఎలా ఉంటుందని ప్రశ్నించారు. తాను క్లీన్ చిట్ తో బయటకు వస్తానని, అప్పుడు తానేంటో చూపిస్తానని హెచ్చరించారు కవిత.