మోదీ వస్తే దేశం అల్లకల్లోలం
నిప్పులు చెరిగిన ఎంకే స్టాలిన్
తమిళనాడు – డీఎంకే చీఫ్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై నిప్పులు చెరిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
ఈ దేశంలో మోదీ వచ్చాక విద్వేషాలు, దౌర్జన్యాలు, అక్రమార్కులకు అంతు అదుపు లేకుండా పోయిందని ఆరోపించారు ఎంకే స్టాలిన్. ఒకవేళ ప్రధానమంత్రిగా తిరిగి ఎన్నికైతే భారత దేశం పూర్తిగా నాశనం అవుతుందని హెచ్చరించారు. రచ్చ నిండిన ప్రాంతంగా మారి పోతుందని, దీనిని జాగ్రత్తగా గమనించాలని సూచించారు.
బీజేపీ దాని అనుబంధ సంస్థలు ద్వేష పూరిత వ్యాఖ్యలు చేస్తూ మనుషుల మధ్య విభేదాలు పొడ సూపేలా పక్కా ప్లాన్ చేస్తున్నారంటూ మండిపడ్డారు సీఎం ఎంకే స్టాలిన్. సమున్నత భారతావని శాంతి యుతంగా ఉండాలంటే నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రాకూడదని అన్నారు. అది తమిళనాడు ప్రజల చేతుల్లోనే ఉందని హెచ్చరించారు.
భారతదేశం శాంతియుతంగా ఉండాలంటే నరేంద్ర మోదీ మళ్లీ అధికారంలోకి రాకూడదని, అది తమిళనాడు ప్రజల చేతుల్లోనే ఉందని టీఎన్ సీఎం అన్నారు.