సుప్రియాపై రనౌత్ సీరియస్
పార్టీ హైకమాండ్ కు ఫిర్యాదు
న్యూఢిల్లీ – ప్రముఖ వివాదాస్పద నటి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనపై కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ సుప్రియా శ్రీనాటే వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు. మంగళవారం కంగనా మీడియాతో మాట్లాడారు.
తన వ్యక్తిగత జీవితం గురించి కామెంట్స్ చేసే హక్కు సుప్రియకు లేదన్నారు. ఈ విషయం గురించి చర్యలు తీసుకోవాల్సింది కాంగ్రెస్ పార్టీనేనని స్పష్టం చేశారు. అయితే పనిలో పనిగా తాను బీజేపీ చీఫ్ జేపీ నడ్డాను కలుసుకునేందుకు ఇక్కడికి రావడం జరిగిందన్నారు కంగనా రనౌత్.
నిన్నటి దాకా నేను నటిని మాత్రమే. కానీ ఇవాల్టి నుంచి నేను జాతీయ పార్టీకి ప్రతినిధిని. ఈ విషయం గురించి నేను హై కమాండ్ తో మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు. దాని తర్వాత పార్టీ పరంగా నోటీసు పంపించడమా లేక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి వదిలి వేయడమా అన్నది త్వరలోనే తేలుతుందన్నారు కంగనా రనౌత్.
నటన నా వృత్తి. దర్శకుడి నిర్ణయం మేరకు తాను నటించాల్సి ఉంటుందన్నారు. అన్ని పాత్రలు చేయాల్సి ఉంటుందని, తన కెరీర్ లో 20 ఏళ్లు పూర్తయినట్లు తెలిపారు.