దానం నాగేందర్ ను వదలం
హెచ్చరించిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. మంగళవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్బంగా ఇటీవలే పార్టీని వదిలి అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో కండువా కప్పుకోవడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు.
తమ పార్టీకి చెందిన గుర్తుతో టికెట్ పొంది గెలుపొందిన ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎలా సికింద్రాబాద్ నుంచి ఎంపీగా ఇతర పార్టీ నుంచి పోటీ చేస్తాడంటూ ప్రశ్నించారు కేటీఆర్. ఇది పూర్తిగా చట్ట విరుద్దమన్నారు. ఎన్నికల నియమావళికి విరుద్దమని స్పష్టం చేశారు.
రానున్న మూడు నాలుగు నెలల్లో ఖైరతాబాద్ లో బై ఎలక్షన్ రాబోతోందని జోష్యం చెప్పారు . ఇందుకు ఖైరతాబాద్ ఓటర్లు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా పార్టీ మారిన దానం నాగేందర్ పై శాసన సభ స్పీకర్ వెంటనే వేటు వేయాలని డిమాండ్ చేశారు. ఒకవేళ సీఎం ఒత్తిడి మేరకు నిర్ణయం తీసుకోక పోతే తాము అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతామని కేటీఆర్ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.