ప‌చ్చ‌ద‌నం ప‌రిశుభ్ర‌త ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త

చెత్త ఊడ్చి చేతులతో ఎత్తిని మంత్రి స‌విత
శ్రీ స‌త్య‌సాయి జిల్లా : ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌త ప్ర‌తి ఒక్క‌రి బాధ్య‌త అని అన్నారు మంత్రి ఎస్. స‌విత‌.
శ్రీ సత్యసాయి జిల్లాలోని పెనుకొండ పట్టణంలో నిర్వహించిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని చెత్త ఊడ్చారు. స్వయంగా మంత్రి తన చేతులతో చెత్త తీసి డస్ట్ బిన్ లో వేశారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. క్లీన్ పెనుకొండ – గ్రీన్ పెనుకొండకు ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. పరిసరాల పరిశుభ్రతతోనే అభివృద్ధి సాధ్యమని నమ్మిన వ్యక్తి సీఎం చంద్రబాబు నాయుడన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ పేరుతో పారిశుధ్యం మెరుగుకు ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రతి నెలా మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్రదేశాల పరిశుభ్రత, రెండో వారంలో కాల్వల శుభ్రత, మూడో వారంలో చెత్త వేరు చేయడంపై అవగాహన, నాలుగో వారంలో పబ్లిక్ టాయిలెట్ల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు తెలిపారు ఎస్. స‌విత‌. పట్టణాలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రభుత్వం ఒక్కటే కాదు ప్రజల భాగస్వామ్యం కూడా ఎంతో అవసరం అని స్ప‌ష్టం చేశారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకునే బాధ్యత తీసుకోవాలి అని మంత్రి సవిత పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, టీడీపీ నాయకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.

  • Related Posts

    ప్రధాని మోదీతో ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియన్ భేటీ

    టెహ్రాన్ : ఇరాన్ అధ్యక్షుడు ప్రధాని మోదీ, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ , కిర్గిజ్‌స్థాన్, రష్యా, తజికిస్థాన్ అధ్యక్షులతో సహా పలువురు పాల్గొనే నాయకులతో ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. కిర్గిజ్‌స్థాన్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్…

    వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభం చారిత్రాత్మక ఘట్టం

    అమరావ‌తి : వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం చారిత్రాత్మక ఘట్టం అని పేర్కొన్నారు మంత్రి మండిప‌ల్లి రాంప్ర‌సాద్ రెడ్డి. సాగునీటి ప్రాజెక్టుల పూర్తికి సీఎం చంద్రబాబు ప్రత్యేక చొరవతో వెలిగొండను పూర్తి చేసి ప్రజలకు అంకితం చేశార‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎంకు ధ‌న్య‌వాదాలు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *