తెలుగు అకాడ‌మీకి పూర్వ వైభ‌వం తీసుకువ‌స్తా

Spread the love

నూత‌న చైర్మ‌న్ కూర‌పాటి వెంక‌ట్ నారాయ‌ణ

వ‌రంగ‌ల్ జిల్లా : తెలుగు అకాడ‌మీ నూత‌న చైర్మ‌న్ గా ఎంపికైన డాక్ట‌ర్ కూర‌పాటి వెంక‌ట్ నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. అకాడ‌మీకి పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాన‌ని చెప్పారు. త‌న‌ను ఘ‌నంగా స‌న్మానించారు వ‌రంగ‌ల్ లోని హ‌నుమ‌కొండ లోని త‌న నివాసంలో. వెంక‌ట్ నారాయ‌ణ త‌న జీవిత కాలంలో తెలంగాణ ఉద్య‌మానికి ఇతోధికంగా సేవ‌లు అందించారు. తెలంగాణ ఉద్యమ నిర్మాతగా గుర్తింపు పొందారు. అలుపెరుగని ఉద్యమకారుడిగా పేరొందారు. తెలంగాణ ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక ఆధ్వర్యంలో ఉద్యమకారులు వారిని మర్యాద పూర్వకంగా కలుసుకుని శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి ఘనంగా సత్కరించారు.

అనంతరం వేదిక రాష్ట్ర చైర్మన్ గోధుమల కుమారస్వామి మాట్లాడారు. ఉద్యమ తొలి కాలం నుండి ప్రొఫెసర్ లు కొత్తపల్లి జయ శంకర్, బియ్యాల జనార్ధన్, గద్దర్, కాళోజీ నారాయణ రావు, భూపతి కృష్ణమూర్తి తో క‌లిసి తెలంగాణ రాష్ట్ర విముక్తి కోసం ఎంత‌గానో శ్ర‌మించార‌ని ప్ర‌శంస‌లు కురిపించారు. తెలంగాణ ఆకాంక్షల కోసం నిరంతరం శ్రమించిన వెంకట్ నారాయణకు తెలుగు అకాడమీ చైర్మన్ పదవి దక్కడం ఉద్యమకారులందరికీ గర్వ కారణమని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా త‌న‌కు చైర్మ‌న్ అప్ప‌గించిన స‌ర్కార్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు వెంక‌ట్ నారాయ‌ణ‌. తెలుగు అకాడ‌మీకి పూర్వ వైభ‌వం తీసుకు వ‌స్తాన‌ని చెప్పారు.

  • Related Posts

    మోదీ విజ‌యంలో డీఎంకేకు కూడా భాగం ఉంది

    Spread the love

    Spread the loveఉద‌య‌నిధి స్టాలిన్ కామెంట్స్ పై కాంగ్రెస్ కౌంట‌ర్ చెన్నై, తమిళనాడు DMK నాయకుడు ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ సీరియ‌స్ గా స్పందించింది. కాంగ్రెస్ నాయకుడు తిరునావుక్కరసర్ ఆదివారం మీడియాతో మాట్లాడారు. నిప్పులు చెరిగారు. కాంగ్రెస్…

    నేరస్తులకు కఠిన శిక్ష పడేలా చూస్తాం

    Spread the love

    Spread the loveప్ర‌క‌టించిన సీఎం జోసెఫ్ విజ‌య్ చెన్నై : త‌మిళ‌నాడు సీఎం జోసెఫ్ విజ‌య్ చంద్ర‌శేఖ‌ర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు .మరణించిన బాలిక కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిందితులకు చట్టం ప్రకారం కఠిన…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *