కాంగ్రెస్ కు షాక్ ఎంపీ జంప్
బీజేపీలో చేరిన రవ్ నీత్ సింగ్
న్యూఢిల్లీ – సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ జంపింగ్ జపాంగ్ లు ఎక్కువై పోయారు. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కాని పరిస్థితి. ఇక కేంద్రంలో కొలువు తీరిన మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే ముచ్చటగా మూడోసారి కేంద్రంలో అధికారంలోకి రావాలని అనుకుంటోంది. ఈ మేరకు ప్రత్యర్థి పార్టీలకు చెందిన కీలకమైన నాయకులు, ప్రజా ప్రతినిధులపై ఫోకస్ పెట్టింది.
వారిని తమ పార్టీలోకి ఆహ్వానిస్తోంది. ఇందులో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసింది. ఇటీవలే ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ నవీన్ జిందాల్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. మోదీ నాయకత్వం దేశానికి అవసరం అంటూ బీజేపీ కండువా కప్పుకున్నట్లు ప్రకటించారు.
ఈ తరుణంలో మరో షాక్ తగిలింది కాంగ్రెస్ పార్టీకి. పంజాబ్ కు చెందిన ఎంపీ రవ్ నీత్ సింగ్ బిట్టు షాక్ ఇచ్చారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ వెంటనే ఢిల్లీలోని బీజేపీ ఆఫీసులో పార్టీ కండువా కప్పుకున్నారు. కేవలం రాష్ట్రంలో అభివృద్ది జరగాలంటే కాషాయ కండువా కప్పుకోక తప్పదన్నారు.