మా ఫోన్లు కూడా ట్యాప్ చేశారు
కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డి
హైదరాబాద్ – కేంద్ర పర్యాటక శాఖ మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం కిషన్ రెడ్డి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడారు. తమ పార్టీకి చెందిన ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ విషయంపై రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వమే విచారణకు ఆదేశించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ అలా కాని పక్షంలో తమ సర్కార్ జోక్యం చేసుకునేందుకు వీలు కలుగుతుందని స్పష్టం చేశారు గంగాపురం కిషన్ రెడ్డి.
ఇదే సమయంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ప్రమేయం లేదని చెప్పే దమ్ము, ధైర్యం మాజీ సీఎం కేసీఆర్ కు లేనే లేదన్నారు . ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. బీజేపీకి, ఈడీకి ఏం సంబంధం ఉంటుందని ప్రశ్నించారు. తమ పార్టీ ఏ సంస్థతోనూ జోక్యం చేసుకోందని మరోసారి కుండ బద్దలు కొట్టారు బీజేపీ చీఫ్.
నిరాధారమైన ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. ఈసారి ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనంటూ ఎద్దేవా చేశారు. తమకు 17 సీట్లు తప్పకుండా వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.