జగన్ చాప్టర్ క్లోజ్ – లోకేష్
ఇంటికి కిలో బంగారం ఇచ్చినా ఓటమే
అమరావతి – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఓటమి పాలవడం ఖాయమని అన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . బుధవారం ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ధ్వజమెత్తారు. అన్ని వర్గాల ప్రజలు తీవ్రమైన నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నారని ఆవేదన చెందారు. వారంతా కలిసికట్టుగా జగన్ రెడ్డిని ఇంటికి పంపించాలని నిర్ణయం తీసుకున్నారంటూ స్పష్టం చేశారు నారా లోకేష్.
ఆరు నూరైనా, ఎన్ని కుట్రలు పన్నినా చివరకు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి గెలుపొందడం ఖాయమని జోష్యం చెప్పారు . అంతే కాదు ఇంటికి కిలో బంగారం చొప్పున లంచంగా ఇచ్చినా జనం ఓటు వేసే పరిస్థితిలో లేరన్నారు. జగన్ పనై పోయిందని, ఇక ఏపీలో పెట్టే బేడా సర్దుకోవడమే మిగిలిందన్నారు నారా లోకేష్.
తాము వచ్చాక రాక్షస పాలనకు చరమ గీతం పాడుతామని, ప్రజా పాలన సాగిస్తామని స్పష్టం చేశారు. చీప్ ట్రిక్స్ తో ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆరోపించారు.