హీరో సిద్దార్థ్ మూడో పెళ్లి
నటి అదితి రావు హైదరీతో
వనపర్తి జిల్లా – ప్రముఖ నటుడు , తమిళనాడుకు చెందిన సిద్దార్థ్ ఓ ఇంటి వాడయ్యాడు. ఆయనకు ఇది ముచ్చటగా మూడో పెళ్లి కావడం విశేషం. గతంలో రెండు పెళ్లిళ్లు జరిగాయి. అవి పెటాకులు అయ్యాయి. ఇక ఆ ముద్దుగుమ్మ ఎవరో కాదు. ప్రముఖ నటి అదితి రావు హైదరీ. ఆమె కూడా ఎంపిక చేసిన కొన్ని సినిమాలలో నటించి మెప్పించింది.
ఆ ఇద్దరూ ఊహించని రీతిలో తెలంగాణ రాష్ట్రంలోని వనపర్తి జిల్లాలో అత్యంత పేరు పొందిన పెబ్బేరు మండలంలోని శ్రీరాంగపురం గ్రామంలోని రంగనాథ స్వామి దేవాయలయంలో పెళ్లి చేసుకున్నారు. వీరిద్దరి వివాహం దేవాలయ మండపంలో జరిగింది.
కాగా అటు సిద్దార్థ్ ,ఇటు హైదరీ గత కొంత కాలం పాటు డేటింగ్ లో ఉన్నారు. పీకల లోతు ప్రేమలో మునిగి పోయారు. దీంతో పెళ్లి చేసుకున్నారంటూ కొంత కాలం ప్రచారం కూడా జరిగింది. చివరకు బుధవారం రోజు హీరో, హీరోయిన్లు ఒక్కటై అందరినీ విస్తు పోయేలా చేశారు. ప్రధానంగా సిద్దార్థ్ అనేసరికల్లా తొలుత గుర్తుకు వచ్చేది బొమ్మరిల్లు చిత్రం. అందులో కొడుకు పాత్రలో అద్భుతంగా నటించాడు.
అయితే వీరిద్దరి వివాహానికి కేవలం కొద్ది మంది మాత్రమే హాజరు కావడం విశేషం.