DEVOTIONAL

తాళ‌ప‌త్ర గ్రంథాల సంర‌క్ష‌ణ భేష్

Share it with your family & friends

టీటీడీని ప్ర‌శంసించిన సీజేఐ చంద్ర‌చూడ్

తిరుమ‌ల – తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ) ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన తాళ ప‌త్రాల గ్రంథాల ప‌రిరక్ష‌ణ అద్భుతంగా ఉంద‌ని కితాబు ఇచ్చారు భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ధ‌నంజ‌య వై చంద్ర‌చూడ్. బుధ‌వారం కుటుంబ స‌మేతంగా తిరుమ‌ల‌ను ద‌ర్శించుకున్నారు. అనంత‌రం శ్రీ వేంకటేశ్వర వేద విశ్వ విద్యాలయంలో డిజిటలైజేషన్ చేస్తున్న తాళ పత్రాలను ప‌రిశీలించారు .

ముందుగా విశ్వ విద్యాలయంచే సంరక్షింప బడుతున్న వేద, వేదాంగ, ఆగమ, పురాణ, ఇతిహాస, న్యాయ , దర్శనాలకు సంబంధించిన తాళ పత్రాల సంరక్షణ, డిజిటలైజేషన్ ప్రక్రియను, వాటి ప్రచురణను ద‌గ్గ‌రుండి చూశారు.

   అనంతరం ప్రధాన న్యాయమూర్తి మీడియాతో మాట్లాడారు. ఇవాళ చాలా సంతోషంగా ఉంద‌న్నారు.   అత్యంత పురాతనమైన తాళ పత్ర గ్రంథాలు ఇక్కడ అద్భుతంగా రక్షించబడుతున్నాయ‌ని కితాబు ఇచ్చారు. 

. ఇక్క‌డ ఉన్న పురాతన న్యాయ శాస్త్ర గ్రంథాల గురించి తెలుసుకున్న‌ట్లు చెప్పారు. ఆ కాలంలో ఉన్న నాగరికతలో న్యాయం ఎలా ఉండేది, న్యాయ విద్య‌ను ఎలా అభ్య‌సించేవారు, పురాతన న్యాయ శాస్త్రం లక్ష్యం ఏమిటి మొదలైన విషయాలు ఆచార్యులు వివ‌రించిన‌ట్లు తెలిపారు.

    ఈ పురాతన తాళపత్ర గ్రంథాల రక్షణ దేశ వ్యాప్తంగా చేయాల‌న్నారు. ఈ తాళపత్ర గ్రంథాల సంరక్షణ, పరిశోధన, ప్రచురణ యొక్క ఫలితాలు  కేవలం భారత దేశానికే కాక విశ్వవ్యాప్తంగా మానవులందరి శ్రేయస్సుకు దోహద పడతాయ‌ని తాను దృఢంగా నమ్ముతున్నాని చెప్పారు.