పవర్ కోసం బాబు ఏమైనా చేస్తాడు
చివరకు గాడిద కాళ్లు కూడా పట్టుకుంటాడు
విజయవాడ – మాజీ మంత్రి , గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మరోసారి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. బుధవారం బెజవాడ ఒకటవ వార్డులో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు కొడాలి నాని.
అధికారం కోసం చంద్రబాబు నాయుడు ఎవరి కాళ్లయినా పట్టుకుంటాడని ఎద్దేవా చేశాడు. అంతే కాదు అవసరమైతే గాడిద కాళ్లు కూడా పట్టుకునేందుకు వెనుకాడడంటూ మండిపడ్డారు కొడాలి నాని. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఈ విషయం తెలుసన్నారు.
కానీ చంద్రబాబు నాయుడు వెనుక ఉన్న నేతలు, కార్యకర్తలు కొద్ది మంది జనసేన పార్టీ కార్యకర్తలకు మాత్రం తెలియదన్నారు. ఆరు నూరైనా సరే జగన్ రెడ్డి మరోసారి సీఎం కావడం ఖాయమని జోష్యం చెప్పారు. తాము అమలు చేసిన నవ రత్నాలు ప్రజలకు మేలు చేకూర్చేలా చేశాయని చెప్పారు. తమ సంక్షేమ పథకాలే తమను గట్టెక్కిస్తాయని అన్నారు కొడాలి నాని.