మేమంతా సిద్దం జనసంద్రం
వైసీపీదే మళ్లీ విజయం
అమరావతి – ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. దారి పొడవునా జనం నీరాజనం పలికారు. వారికి అభివాదం చేశారు. అనంతరం ఇడుపులపాయకు వెళ్లారు. అక్కడ సర్వమత ప్రార్థనల మధ్య తన తండ్రి, దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద పూల గుచ్ఛం ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం తన తల్లి విజయమ్మను అక్కున చేర్చుకున్నారు. ఈ సందర్బంగా కొడుకు యాత్ర దిగ్విజయంగా సాగాలని దీవించారు.
తన కొడుకుని మరోసారి గెలిపించాలని, జగన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేయాలని, రాజన్న కలలు కన్న రాజ్యాన్ని తీసుకు రావాలని , ఇది కేవలం జగన్ వల్లనే సాధ్యమవుతుందని అన్నారు తల్లి విజయమ్మ. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఏపీ సీఎం.
దేశంలో ఎక్కడా లేని రీతిలో ఏపీలో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందన్నారు. ప్రధానంగా విద్య, వైద్యం, ఉపాధిపై ఎక్కువగా శ్రద్ద పెట్టామన్నారు. నాడు నేడు కింద బడులు కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా తయారు చేశామన్నారు. పారిశ్రామికంగా ఎన్నో కంపెనీలు ఏపీలో కొలువు తీరాయని చెప్పారు. నవ రత్నాలు దిగ్విజయంగా అమలవుతున్నాయని తెలిపారు.