DEVOTIONAL

శివ శివా ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కించ‌వా

Share it with your family & friends

అంతా బాగుండాల‌ని ప్రార్థ‌న

క‌ర్ణాట‌క – సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో నేత‌లు ప్రార్థ‌నా మందిరాల‌ను సంద‌ర్శించ‌డం ప‌రిపాటిగా మారింది. ప్ర‌ధానంగా గ‌త ఎన్నిక‌ల్లో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించి కాంగ్రెస్ పార్టీని ప‌వ‌ర్ లోకి తీసుకు రావ‌డంలో కీల‌కంగా మారారు క‌ర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూనే ట్ర‌బుల్ షూట‌ర్ గా మారారు.

ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ స‌త్తా చాటాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు డీకే శివ‌కుమార్. ఆయ‌న ఈ సంద‌ర్బంగా మ‌ఠాల‌ను , శైవ క్షేత్రాల‌తో పాటు ప‌నిలో ప‌నిగా పేరు పొందిన‌, కోరిన కోర్కెలు తీర్చే ఆల‌యాల‌ను సంద‌ర్శిస్తున్నారు.

తాజాగా బుధ‌వారం ప్ర‌ముఖ పేరు పొందిన గోక‌ర్ణంలోని శ్రీ మ‌హా బ‌లేశ్వ‌ర ఆల‌యాన్ని సంద‌ర్శించారు. దేవుడిని ద‌ర్శించుకున్నారు డీకే శివ‌కుమార్. ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ ఆల‌యం ముక్తి క్షేత్రాల‌లో ఒక‌టిగా పేరు పొందింది. శివుడి ఆత్మ లింగం లేదా ప్రాణ లింగం ఇక్క‌డి ప్ర‌త్యేక‌త‌.