NEWSANDHRA PRADESH

ఏపీ బీజేపీ అసెంబ్లీ అభ్య‌ర్థులు ఖ‌రారు

Share it with your family & friends

విడుద‌ల చేసిన పార్టీ హైక‌మాండ్
అమ‌రావతి – రాష్ట్రంలో జ‌రిగే అసెంబ్లీ, పార్ల‌మెంట్ ఎన్నిక‌ల‌కు సంబంధించి పొత్తులో భాగంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు తెలుగుదేశం, జ‌న‌సేన పార్టీతో బీజేపీ కూట‌మిగా ఏర్ప‌డింది. ఈ మేర‌కు 175 అసెంబ్లీ స్థానాలతో పాటు 25 లోక్ స‌భ స్థానాల‌కు సంబంధించి మూడు పార్టీల నేత‌లు కొలిక్కి వ‌చ్చారు.

ఇందులో భాగంగా బీజేపీ 10 శాస‌న స‌భ స్థానాల‌తో పాటు 6 లోక్ స‌భ స్థానాల‌ను ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు బుధ‌వారం పార్టీ హై క‌మాండ్ తాజాగా అసెంబ్లీ స్థానాల‌కు అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించింది. ప్ర‌స్తుతం బీజేపీ ఐదో జాబితాలో ఆరుగురు ఎంపీ అభ్య‌ర్థుల‌ను కూడా ఖ‌రారు చేశారు.

మొత్తం 10 శాస‌న స‌భ స్థానాల‌ను ప్ర‌క‌టించింది. ఇక నియోజ‌క‌వ‌ర్గాల వారీగా చూస్తే అన‌ప‌ర్తి శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి సంబంధించి శివ రామ కృష్ణ రాజు ను ఎంపిక చేసింది. ఎచ్చ‌ర్ల‌కు ఎన్ . ఈశ్వ‌ర్ రావు, విశాఖ తూర్పు నియోజ‌క‌వ‌ర్గానికి పి. విష్ణు కుమార్ రాజు, ధ‌ర్మ‌వ‌రం కు వై. స‌త్య కుమార్ , విజ‌య‌వాడ ప‌శ్చిమ‌కు సుజ‌నా చౌద‌రి, కైక‌లూరుకు కామినేని శ్రీ‌నివాస్ రావు, ఆదోనికి పీవీ పార్థ‌సార‌థి, అర‌కు వ్యాలీకి పొంగి రాజారావు, జ‌మ్మ‌ల‌మ‌డుగుకు ఆది నారాయ‌ణ రెడ్డి, బ‌ద్వేలుకు బొజ్జా రోష‌న్న‌ను ఎంపిక చేశారు.

ఇక ఎంపీ అభ్య‌ర్థుల‌కు సంబంధించి చూస్తే అర‌కు నియోజ‌క‌వ‌ర్గానికి కొత్త ప‌ల్లి గీత‌, అన‌కాప‌ల్లికి సీఎం ర‌మేష్ , రాజమహేంద్రవరం నుంచి పురందేశ్వరి, నర్సాపురం నుంచి భూపతిరాజు శ్రీనివాస వర్మ, తిరుపతి (ఎస్సీ) నుంచి వరప్రసాదరావు, రాజంపేట నుంచి కిరణ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేశారు.