ఐపీఎల్ లో హైద్రాబాద్ భారీ స్కోర్
20 ఓవర్లలో 277 పరుగులు
హైదరాబాద్ – ఐపీఎల్ టోర్నీ 2024 లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన కీలక లీగ్ మ్యాచ్ లో అరుదైన రికార్డు నమోదైంది. భారీ స్కోర్ ను సాధించింది. ప్రత్యర్థి జట్టు ముంబై ఇండియన్స్ కు చుక్కలు చూపించింది సన్ రైజర్స్ హైదరాబాద్ ( ఎస్ఆర్ హెచ్ ).
ముందుగా బ్యాటింగ్ కు దిగిన ఎస్ ఆర్ హెచ్ చుక్కలు చూపించింది. పరుగుల వరద పారించింది. మరోసారి సత్తా చాటాడు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్. అద్భుతమైన ఆట తీరుతో ఆకట్టుకున్నారు.
ముంబై బౌలర్లకు చుక్కలు చూపించారు. అభిషేక్ శర్మ 23 బంతులు ఎదుర్కొని 63 రన్స్ చేశాడు. ఇక హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా రెచ్చి పోయాడు . 34 బంతులు ఎదుర్కొని 80 పరుగులు చేశాడు. నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 277 రన్స్ చేసింది.
ఇండియన్ ప్రిమీయర్ లీగ్ చరిత్రలో అత్యధిక స్కోర్ ను సాధించింది. ఇంత వరకు ఏ జట్టు ఇంత భారీ ఎత్తున స్కోర్ సాధించ లేక పోయింది. కెప్టెన్ మార్క్రామ్ సైతం సత్తా చాటాడు. ఈ మ్యాచ్ రోహిత్ శర్మ కు 200 వ మ్యాచ్ కావడం విశేషం.