క్లాసెన్ సెన్సేషన్ ముంబై పరేషాన్
రెచ్చి పోయిన హైద్రాబాద్ ప్లేయర్లు
హైదరాబాద్ – సన్ రైజర్స్ హైదరాబాద్ ఊహించని రీతిలో భారీ స్కోర్ చేసింది. ఐపీఎల్ చరిత్రలో ఇది ఓ అరుదైన రికార్డు. ఏకంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 3 వికెట్లు కోల్పోయి 277 రన్స్ చేసింది. భారీ టార్గెట్ ను ముంబై ఇండియన్స్ ముందు ఉంచింది.
అభిషేక్ శర్మ దుమ్ము రేపితే మరో వైపు మైదానం నలు వైపులా రెచ్చి పోయి ఆడారు ట్రావిస్ హెడ్ , హెన్రిచ్ క్లాసెన్. శర్మ 63 రన్స్ చేస్తే ..హెన్రిచ్ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. ముంబై బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఏకంగా 34 బంతులు ఎదుర్కొని 80 రన్స్ చేశాడు. దీంతో స్కోర్ బోర్డు పరుగుల వరద పారింది.
గత ఏడాది జరిగిన ఐపీఎల్ లో అత్యంత పేలవమైన ప్రదర్శన చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. సదరు జట్టు సిఇఓ కావ్య మారన్ భారీ ధరకు ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఆమె చేసిన ప్రయత్నం ఫలించింది. ఉప్పల్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ మాత్రం ఆ జట్టుకు మరింత బూస్ట్ ను ఇచ్చిందని చెప్పక తప్పదు.