హైదరాబాద్ భళా ముంబై విలవిల
31 పరుగుల తేడాతో పరాజయం
హైదరాబాద్ – ఐపీఎల్ 2024లో భాగంగా హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా పరుగుల వర్షం కురిసింది. తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ దుమ్ము రేపింది. ముంబై బౌలర్లను ఉతికి ఆరేసింది. అజయ్ శర్మ , ట్రావిస్ హెడ్ , హెన్రిచ్ క్లాసెన్ లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. దీంతో నిర్ణీ త 20 ఓవర్లలో ఏకంగా హైద్రాబాద్ జట్టు 277 పరుగులు చేసింది. భారీ లక్ష్యాన్ని ముంబై ముందు ఉంచింది. ఐపీఎల్ చరిత్రలో ఇదే భారీ స్కోర్ కావడం విశేషం.
అనంతరం భారీ ఛేదనలో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ అదే దూకుడు ప్రదర్శించింది. చివరకు 31 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఇక హైదరాబాద్ ఆటగాళ్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. హెడ్ 18 బంతులు ఎదుర్కొని 62 రన్స్ చేశాడు. అభిషేక్ 63 పరుగులతో స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక మైదానంలోకి దిన క్లాసెన్ సెన్సేషన్ ఇన్నింగ్స్ తో దుమ్ము రేపాడు.
ఇక ముంబై విషయానికి వస్తే ఇషాన్ కిషన్ 34 రన్స్ చేస్తే రోహిత్ శర్మ 24 రన్స్ చేశాడు. హైదరాబాద్ కుర్రాడు తిలక్ వర్మ ధాటిగా ఆడాడు. 64 రన్స్ సాధించాడు. నమన్ ధార్ 30 పరుగులు చేశాడు.హార్దిక్ పాండ్యా 24 రన్స్ చేస్తే టిమ్ డేవిడ్ 42 పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. ఆట ముగిసే సమయానికి ముంబై ఇండియన్స్ 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులకే పరిమితమైంది.