మోదీకి రుణపడి ఉన్నా – కంగనా
ఎంపీగా ప్రకటించడం సంతోషం
ముంబై – ప్రముఖ వివాదాస్పద బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. కంగనా జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా తన మనో భావాలను పంచుకున్నారు.
ఈ దేశంలో మోదీ ప్రధానమంత్రిగా కొలువు తీరాక 143 కోట్ల మంది ప్రశాంతంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజలు సమర్థవంతమైన నాయకత్వాన్ని, సుస్థిరమైన పాలనను కోరుకుంటున్నారని ఇది కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఇవ్వ గలుగుతుందని వారికి నమ్మకం ఏర్పడిందన్నారు.
మరోసారి 2019లో వచ్చిన ఎన్నికల ఫలితాలే తిరిగి పునరావృతం అవుతుందని ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు కంగనౌ రనౌత్. తాను కూడా కలలో కూడా అనుకోలేదని, తనకు ఎంపీ టికెట్ వస్తుందని అన్నారు నటి.
ఇదిలా ఉండగా ప్రపంచంలో ఎక్కడైనా ఇల్లు నిర్మించుకునే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. ఇప్పుడు ఎక్కడ లేని ఆనందం కలుగుతోందన్నారు. మనాలి నాకు ఇష్టమైన ప్రాంతం. తిరిగి సేవ చేసేందుకు దేవుడు మోదీ రూపంలో తనకు అవకాశం ఇచ్చాడని చెప్పారు కంగనా రనౌత్.