NEWSNATIONAL

మోదీ ప్ర‌భుత్వం నిరుద్యోగ భార‌తం

Share it with your family & friends

నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ

న్యూఢిల్లీ – గ‌త ప‌దేళ్ల మోదీ పాల‌న‌లో నిరుద్యోగం పెచ్చ‌రిల్లి పోయింద‌ని , ఈ విష‌యాన్ని తాను చెప్ప‌డం లేద‌ని అంత‌ర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) గ‌ణాంకాల‌తో వెల్ల‌డించింద‌ని పేర్కొన్నారు. గ‌త కొంత కాలంగా తాను మొత్తుకుంటూనే ఉన్నాన‌ని , కానీ ప్ర‌ధాని ప‌ట్టించు కోవ‌డం లేద‌ని మండిప‌డ్డారు.

కేవ‌లం బ‌డా బాబుల‌కు మేలు చేకూర్చే ప‌నిలో బిజీగా ఉన్నార‌ని ఆరోపించారు. ఎల‌క్టోర‌ల్ బాండ్ల రూపేణా పార్టీ కోసం విరాళాలు సేక‌రించ‌డంలో ముందంజ‌లో ఉన్న మోదీ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఎలా ప‌ట్టించు కుంటార‌ని ప్ర‌శ్నించారు.

దేశ వ్యాప్తంగా ఉన్న యువ‌త‌లో 83 శాతం నిరుద్యోగులుగానే ఉన్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆర్థిక కార్య‌క‌లాపాల్లో నిమ‌గ్న‌మైన వారిలో 2012లో 42 శాతం ఉంటే ఉన్న‌ట్టుండి మోదీ కొలువు తీరాక అది 37 శాతానికి త‌గ్గింద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

నిరుద్యోగం మూడు రెట్లు పెరిగింద‌న్నారు. యువ‌త‌కు జ‌రుగుతున్న అన్యాయానికి వ్య‌తిరేకంగా త‌మ ప‌రా్టీ యువ న్యాయం తీసుకు వ‌చ్చింద‌ని చెప్పారు. ఈ దేశంలో ప్ర‌జా స్వామ్యానికి ముప్పు ఏర్ప‌డింద‌ని అన్నారు. అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వీర్యం చేసిన ఘ‌న‌త పీఎంకే ద‌క్కుతుంద‌న్నారు రాహుల్ గాంధీ.