నా బతుకంతా కాషాయమే – షా
కేంద్ర హోం మంత్రి కామెంట్స్
న్యూఢిల్లీ – కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షా షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఓ జాతీయ మీడియాతో ముఖాముఖి సందర్బంగా పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. మీకు బీజేపీకి ఎలాంటి అనుబంధం ఉందన్న ప్రశ్నకు తాను చివరి క్షణం వరకు బీజేపీలోనే ఉంటానని స్పష్టం చేశారు అమిత్ చంద్ర షా.
తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు బీజేపీలోనే పని చేస్తానని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని పేర్కొన్నారు. తాను కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తినని తెలిపారు. మిమ్మల్ని ట్రబుల్ షూటర్ అని పిలుస్తారని మీరు ఎలా ఫీల్ అవుతారన్న ప్రశ్నకు అదంతా మీడియా పెట్టిన పేరు మాత్రమేనని పేర్కొన్నారు కేంద్ర హొం శాఖ మంత్రి.
తన బతుకంతా కాషాయమేనని , తాను చనిపోయాక కూడా తన ఆత్మ బీజేపీ కోసం పాకులుడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు అమిత్ చంద్ర షా. ఈసారి కూడా 2019లో జరిగిన ఫలితాలే తిరిగి అంతకంటే ఎక్కువగా వస్తాయని పేర్కొన్నారు.