జనం గెలిపించేందుకు సిద్దం
ఎంపీ విజయ సాయి రెడ్డి కామెంట్
అమరావతి – ఆరు నూరైనా సరే జగన్ రెడ్డిని ఓడించే దమ్ము ఏ ఒక్కరికీ లేదన్నారు ఎంపీ విజయ సాయి రెడ్డి. తమ పార్టీ అధినేత చేపట్టిన ప్రజా యాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారని, ఇది రాబోయే విజయాన్ని సూచిస్తోందని స్పష్టం చేశారు. గురువారం ట్విట్టర్ వేదికగా స్పందించారు విజయ సాయిరెడ్డి.
ప్రత్యేకించి జన నేతను చూసేందుకు పెద్ద ఎత్తున తరలి వచ్చారని స్పష్టం చేశారు. ఆయనకు అండగా ఉండేందుకు తమ మద్దతు ప్రకటించారని ఇది కూటమికి అర్థం కాదన్నారు. ఎన్ని పార్టీలు ఏకమైనా జగన్ రెడ్డి లాంటి పులిని ఢీకొనడం తట్టుకోలేరని పేర్కొన్నారు.
గతంలో జరిగిన ఎన్నికల్లో వచ్చిన ఫలితాల కంటే ఎక్కువగా ఈసారి సీట్లు తమకు వస్తాయని జోష్యం చెప్పారు విజయ సాయి రెడ్డి. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలను అమలు చేయడం జరిగిందని చెప్పారు. నవ రత్నాలు ద్వారా ప్రతి ఒక్కరికీ లబ్ది చేకూరేలా ప్రయత్నం చేశామన్నారు విజయ సాయి రెడ్డి.
రాజన్న రాజ్యం కోసం ప్రజలు వేచి చూస్తున్నారని, మరోసారి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఖాయమని జోష్యం చెప్పారు.