నటించడంలో జగన్ ఎక్స్ పర్ట్
నిప్పులు చెరిగిన చంద్రబాబు
అమరావతి – ఏపీ సీఎం జగన్ రెడ్డిని మించిన నటుడు దేశంలోనే లేడంటూ ఎద్దేవా చేశారు టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎన్నికలకు ముందు ఆత్మ బంధువులా ముద్దులు పెట్టాడని, తలలు నిమిరి ఓట్లు వేయించు కున్నాడని ధ్వజమెత్తారు. తీరా అధికారంలోకి వచ్చాక పన్నుల మోత మోగిస్తున్నాడని ఆరోపించారు నారా చంద్రబాబు నాయుడు.
జనం పూర్తిగా జగన్ రెడ్డిని ఇంటికి పంపించాలని డిసైడ్ అయ్యారని, ఇక ఏపీలో జగన్ పాలనకు తెర పడే రోజు దగ్గరలోనే ఉందన్నారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు. అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేసిన ఘనత సీఎంకే దక్కుతుందన్నారు. ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులకు లోనవుతున్నారని , ఇప్పటికే రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడని ఆవేదన చెందారు నారా చంద్రబాబు నాయుడు.
నటనలో రాజకీయ పరంగా అవార్డులు ఇస్తే తొలుత జగన్ రెడ్డికే వస్తుందంటూ సెటైర్ వేశారు. ఇకనైనా ప్రజలు మేల్కోవాలని టీడీపీ కూటమికి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.