సీజేఐతో సీఎం రేవంత్ భేటీ
మర్యాద పూర్వకంగా కలయిక
హైదరాబాద్ – భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ ను గురువారం మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ఈ సందర్బంగా సీజేఐకి పుష్ప గుచ్ఛం ఇచ్చి స్వాగతం పలికారు.
భారత దేశ న్యాయ చరిత్రలో విలక్షణమైన తీర్పులకు పెట్టింది పేరు జస్టిస్ డీవై చంద్రచూడ్. ఆయన తండ్రి కూడా ఒకప్పుడు సుప్రీంకోర్టుకు సీజేఐగా పని చేశారు. ఆయన ఆధ్వర్యంలోనే కీలకమైన తీర్పులు వెలువడ్డాయి. తాజాగా సంచలనం రేపుతున్న ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై ఇచ్చిన తీర్పు కలకలం రేపింది.
దీని దెబ్బకు దేశంలోని ఆయా రాజకీయ పార్టీల బండారం వెలుగు చూసింది. అక్రమంగా సంపాదించిన వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు, కంపెనీలు ఎలా బాండ్ల రూపంలో సమర్పించుకున్నాయో తేట తెల్లం అయ్యింది. దీనికి ప్రధాన కారకుడు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్.
విధి నిర్వహణలో నిఖార్సయిన న్యాయమూర్తిగా గుర్తింపు పొందారు. న్యాయ వ్యవస్థకు ఆయన రెండు కళ్లు లాగా వ్యవహరిస్తున్నారు. కోట్లాది మంది ప్రజలకు స్పూర్తి దాయకంగా నిలిచారు.