రైతు కొడుకును గెలిపించండి
మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్
రాజస్థాన్ – జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తన గళం విప్పారు. బీజేపీని గెలిపించ వద్దని కోరుతూ ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా రాజస్థాన్ లోని జైపూర్ లో పర్యటించారు. ఇదే సమయంలో తనను కలిసిన జైపూర్ రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ చోప్రాను ప్రత్యేకంగా అభినందించారు సత్య పాల్ మాలిక్.
ఈ దేశంలో మతం పేరుతో , కులం పేరుతో రాచరికం నడుస్తోందని ఆరోపించారు. ఈ దేశానికి కావాల్సింది ఉక్కు సంకల్పంతో కూడిన యువత అన్నారు. రైతు కొడుకు, తన తమ్ముడైన అనిల్ చోప్రాను గెలిపించాలని కోరారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావించాలంటే, పార్లమెంట్ లో బలంగా వినిపించాలంటే తప్పనిసరిగా మీ విలువైన ఓటు వేయాలని అన్నారు సత్య పాల్ మాలిక్.
పేద ప్రజలు, నిరుద్యోగ యువత, రైతులపై జరుగుతున్న అకృత్యాలకు వ్యతిరేకంగా అనిల్ చోప్రా గత కొంత కాలం నుంచి పోరాడుతూనే వచ్చాడని కితాబు ఇచ్చారు మాజీ గవర్నర్. తను తప్పక గెలుస్తాడన్న నమ్మకం ఉందన్నారు .