జనానికి జగన్ భరోసా
గెలిపిస్తే స్వర్ణాంధ్రప్రదేశ్ చేస్తా
నంద్యాల – ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జైత్రయాత్ర కొనసాగుతోంది. యుద్దానికి సిద్దం పేరుతో ఆయన దూకుడు పెంచారు. మరోసారి ఏపీలో పాగా వేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. బస్సు యాత్రకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు. ఆళ్లగడ్డ నైట్ హాల్ట్ నుంచి గురువారం యాత్ర ప్రారంభమైంది. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు నేతలు వైసీపీ కండువా కప్పుకున్నారు.
అనంతరం ఎర్రగుంట్లలో ప్రజలు, మేధావులతో ముఖాముఖి చేపట్టారు. వారి సలహాలు, సూచనలు స్వీకరించారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేకూర్చేలా తాము ప్రయత్నం చేస్తున్నామని ఈ సందర్బంగా చెప్పారు జగన్ మోహన్ రెడ్డి.
దేశంలో ఎక్కడా లేని విధంగా విద్య, వైద్యం, ఉపాధిపై ఫోకస్ పెట్టామన్నారు సీఎం. పరిశ్రమల ఏర్పాటు వల్ల ఉపాధి దొరుకుతోందన్నారు. ప్రతి ఒక్కరు చదువుకుంటేనే గుర్తింపు లభిస్తుందని, అందుకే నాడు నేడు కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు.
మహిళా నాయకురాలు వాసిరెడ్డి పద్మ మాట్లాడారు. నేను ఉన్నాను అన్న భరోసా కల్పించిన ఘనత , ఏకైక నాయకుడు జగన్ మోహన్ రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. ఇవాళ మహిళ సాధికారత కోసం కృషి చేస్తున్న సీఎం మన నేత అని కితాబు ఇచ్చారు.