NEWSNATIONAL

ఎవ‌రీ న‌వ‌నీత్ రాణా

Share it with your family & friends

బీజేపీ నుంచి బ‌రిలోకి

మ‌హారాష్ట్ర – మ‌రోసారి హాట్ టాపిక్ గా మ‌రారు న‌వ‌నీత్ రాణా. ఆమె కాషాయ జెండా క‌ప్పుకున్నారు. ఆమె గ‌తంలో 2019లో జ‌రిగిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో అమ‌రావ‌తి లోక్ స‌భ స్థానం నుంచి ఇండిపెండెట్ గా గెలుపొందారు. త‌ను అవ‌స‌ర‌మైన ప్ర‌తి స‌మ‌యంలో త‌న గొంతు వినిపిస్తూ వ‌చ్చారు. ప్ర‌ధానంగా మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు .

తాజాగా బీజేపీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. పార్టీలో చేరిన వెంట‌నే ఆమెకు అమ‌రావ‌తి సీటు కేటాయిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది హైక‌మాండ్. తాజాగా ప్ర‌క‌టించిన ఎంపీ అభ్య‌ర్థుల జాబితాలో త‌ను కూడా చోటు ద‌క్కించుకుంది. దీంతో తెగ ముచ్చ‌ట ప‌డుతోంది ఈమె.

మ‌రాఠా లోని ముంబై ఆమె స్వ‌స్థ‌లం. త‌ను ఆర్మీ ఆఫీస‌ర్ కూతురు. న‌వ‌నీత్ రాణా మోడ‌ల్ గా ప్రారంభించింది. మ్యూజిక్ వీడియోల‌లో న‌టించింది. ద‌క్షిణాది సినిమాల‌లో కూడా హీరోయిన్ గా న‌టించి మెప్పించింది.

ఇదే స‌మ‌యంలో బీజేపీ నేత ర‌వి రాణాను ఆమె పెళ్లి చేసుకున్నారు. త‌న రాజ‌కీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014లో అమ‌రావ‌తి నుంచి ఎన్సీపీ పై పోటీ చేసినా ఓడి పోయారు. 2019లో స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా గెలుపొందారు. ఆమెపై ప్ర‌స్తుతం కోర్టులో కేసు న‌డుస్తోంది.