సీఎం పదవి తొలగింపు కుదరదు
కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు ఊరట
న్యూఢిల్లీ – ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ మేరకు ఆయనను కేంద్ర దర్యాప్తు సంస్థ అరెస్ట్ చేసింది. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. ఈ సందర్బంగా తాను జైలు నుంచే పాలన కొనసాగిస్తానంటూ సంచలన ప్రకటన చేశారు. తనకు ఎలాంటి సంబంధం లేదని ఈ సందర్బంగా పేర్కొన్నారు. కేవలం కక్ష సాధింపుతోనే కేంద్రం తనను అరెస్ట్ చేసిందంటూ ఆరోపించారు.
ఇదిలా ఉండగా ఢిల్లీ రాస్ ఎవెన్యూ కోర్టులో గురువారం సీఎం పదవి నుంచి వెంటనే కేజ్రీవాల్ ను తొలగించాలని కోరుతూ దాఖలైన పిటిషన్ పై విచారణ జరిగింది. ఈ సందర్బంగా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది.
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన సీఎం పదవి నుంచి ఎలా తొలగిస్తామంటూ ప్రశ్నించింది. ఇంకా నేరం రుజువు కానంత వరకు తను ఆ పదవిలో ఉండవచ్చని పేర్కొంది. ఇదే సమయంలో దాఖలు చేసిన పిటిషన్ ను తిరస్కరిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది.