NEWSANDHRA PRADESH

జ‌న‌మే జెండా అభివృద్దే ఎజెండా

Share it with your family & friends

స్ప‌ష్టం చేసిన విజ‌య సాయి రెడ్డి

ఉద‌య‌గిరి – వైసీపీ ఎంపీ అభ్య‌ర్థి విజ‌య సాయి రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆరు నూరైనా స‌రే వైసీపీ గెలుపును ఏ శ‌క్తి, ఏ కూట‌మి అడ్డు కోలేద‌న్నారు. ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా గురువారం ఉద‌య‌గిరి ఎమ్మెల్యే మేక‌పాటి రాజ‌గోపాల్ రెడ్డితో క‌లిసి సీతాపురం మండ‌లం బ‌స్టాండ్ సెంట‌ర్ లో జ‌రిగిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు.

ఈ దేశంలో ఎక్క‌డా లేని విధంగా సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేసిన ఘ‌న‌త త‌మ‌దేన‌ని అన్నారు. యువ నాయ‌కుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల కోసం అహ‌ర్నిశ‌లు కృషి చేస్తున్నాన‌ని స్ప‌ష్టం చేశారు. విద్య‌, వైద్యం, ఉపాధి, ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటు, వ‌న‌రుల విన‌యోగంపై ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టామ‌న్నారు విజ‌య సాయి రెడ్డి.

ఎంపీగా త‌న‌ను మ‌రోసారి ఆశీర్వ‌దించాల‌ని, అలాగే త‌న సోద‌ర స‌మానుడైన ప్ర‌జా నాయ‌కుడిగా గుర్తింపు పొందిన మేక‌పాటి రాజ‌గోపాల్ రెడ్డిని ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించాల‌ని పిలుపునిచ్చారు ఎంపీ. ఉద‌య‌గిరిని అన్ని రంగాల‌లో అభివృద్ది చేసే బాధ్య‌త తాను తీసుకుంటాన‌ని చెప్పారు విజ‌య సాయి రెడ్డి. టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ పార్టీల‌ను ఎవ‌రూ నమ్మ‌డం లేద‌న్నారు. వారికి అంత సీన్ లేద‌న్నారు