NEWSTELANGANA

ఓటు వేసిన సీఎం రేవంత్ రెడ్డి

Share it with your family & friends

కోడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఓటు

కోడంగ‌ల్ – టీపీసీసీ చీఫ్‌, తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గురువారం ఓటు వేశారు. ఇవాళ ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా స్థానిక సంస్థ‌ల శాస‌న మండ‌లి ఉప ఎన్నిక జ‌రుగ‌తోంది. ఈ సంద‌ర్బంగా సీఎం ప్ర‌స్తుతం కోడంగ‌ల్ శాస‌న స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.

స్థానిక మండ‌ల ప్ర‌జా ప‌రిష‌త్తు కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన ఎన్నిక‌ల బాక్సులో త‌న విలువైన ఓటు వేశారు. ఈ సంద‌ర్బంగా సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్ర‌జాస్వామ్యంలో ప్ర‌తి ఓటు విలువైన‌దేన‌ని అన్నారు. త‌మ పార్టీ త‌ర‌పున అభ్య‌ర్థిగా బ‌రిలో నిలిచిన మ‌న్నె జీవ‌న్ రెడ్డి గెలుపొంద‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు.

అభివృద్దే ఎజెండాగా, ప్ర‌జా పాల‌నే ధ్యేయంగా తాము ముందుకు వెళుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ఒక్క‌టొక్క‌టిగా ప‌రిష్క‌రిస్తూ వ‌స్తున్నామ‌ని తెలిపారు. త్వ‌ర‌లోనే ఇచ్చిన అన్ని హామీలు పూర్తిగా అమ‌లు చేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.