ENTERTAINMENT

శివ‌సేన‌లో చేరిన గోవింద

Share it with your family & friends

పార్టీలోకి ఆహ్వానించిన సీఎం

ముంబై – పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వేళ వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు క్యూ క‌డుతున్నారు ఆయా పార్టీల‌లో చేరేందుకు. ప్ర‌స్తుతం సీఎం ఏక్ నాథ్ షిండే సార‌థ్యంలోని శివ‌సేన‌, భార‌తీయ జ‌న‌తా పార్టీల‌తో కూడిన కూట‌మి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్ర‌స్తుతం సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగుతుండ‌డంతో సినీ రంగానికి చెందిన వారు కూడా జంప్ అవుతున్నారు.

ఒక‌ప్ప‌టి న‌టి , అమ‌రావ‌తి లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి స్వ‌తంత్ర అభ్య‌ర్థిగా గెలుపొందిన న‌వ‌నీత్ రాణా ఉన్న‌ట్టుండి ఈసారి పార్టీ మారారు. ఆమె భార‌తీయ జ‌న‌తా పార్టీ కండువా క‌ప్పుకున్నారు. ఆమెకు అదే స్థానం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా హైక‌మాండ్ ఖ‌రారు చేసింది.

తాజాగా గురువారం మ‌రో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. బాలీవుడ్ లో ప్ర‌ముఖ న‌టుడిగా వెలుగొందుతూ వ‌చ్చారు గ‌త కొంత కాలంగా గోవింద‌. ఆయ‌న డ్యాన్సుల‌కు, డైలాగులకు పెట్టింది పేరు. ఎవ‌ర్ గ్రీన్ హీరోగా గుర్తింపు పొందారు. త‌నకంటూ ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. న‌టుడు గోవింద ఉన్న‌ట్టుండి షాక్ ఇచ్చారు. ఆయ‌న సీఎం ఏక్ నాథ్ షిండే స‌మ‌క్షంలో శివ‌సేన పార్టీలో చేరారు. ఆయ‌న‌కు పార్టీ కండువా క‌ప్పి ఆహ్వానించారు.