న్యాయవాదుల లేఖ కలకలం
న్యాయ వ్యవస్థపై దాడి దారుణం
న్యూఢిల్లీ – ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 600 మందికి పైగా న్యాయవాదులు కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు వారంతా కలిసి సుదీర్ఘమైన లేఖ రాశారు భారతదేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ ధనంజయ వై చంద్రచూడ్ కు. ఈ లేఖ ప్రస్తుతం కలకలం రేపుతోంది.
ఈ దేశంలో ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే సీజేఐ సంచలన తీర్పు వెలువరించారు. ప్రధానంగా నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ ప్రభుత్వం 2018లో తీసుకు వచ్చిన అనైతిక పథకం ఎలక్టోరల్ బాండ్ల పథకం పూర్తిగా చట్ట విరుద్దమని స్పష్టం చేశారు.
దీంతో ఆయా రాజకీయ పార్టీల బండారం మొత్తం బయట పడింది. అక్రమార్కులు ఎవరో తేలి పోయింది. ఏకంగా రూ. 6,000 కోట్లకు పైగా ఎలక్టోరల్ బాండ్ల రూపంలో భారతీయ జనతా పార్టీ లబ్ది పొందింది. ఇది దేశంలోనే అత్యంత బహిరంగ దోపిడీ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా న్యాయవాదులు రాసిన లేఖలో కీలక అంశాలు ప్రస్తావించారు. కొందరు పనిగట్టుకుని న్యాయ వ్యవస్థకు ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్నారని, నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. వారిపై కన్నేసి ఉంచాలని, చర్యలు తీసుకోవాలని కోరారు.