NEWSNATIONAL

గ్యాంగ్‌స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి

Share it with your family & friends

మాఫియా డాన్ ..పొలిటిక‌ల్ లీడ‌ర్

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ – క‌ర‌డు గ‌ట్టిన గ్యాంగ‌స్ట‌ర్ , పొలిటిక‌ల్ లీడ‌ర్ గా గుర్తింపు పొందిన యూపీకి చెందిన ముఖ్తార్ అన్సారీ క‌థ ముగిసింది. ఆయ‌న గుండె పోటుతో మ‌ర‌ణించిన‌ట్లు వైద్యులు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతంలో జైలులో ఉన్నారు. స‌డెన్ గా అనారోగ్యానికి గురి కావ‌డంతో యూపీలోని బందాలో గ‌ల ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చివ‌ర‌కు మృతి చెందిన‌ట్లు నిర్ధారించారు.

ముఖ్తార్ అన్సారీపై 63కు పైగా కేసులు ఉన్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న మౌ నియోజ‌క‌వ‌ర్గం నుంచి రికార్డు స్థాయిలో నాలుగుసార్లు ఎన్నిక‌య్యారు. ఇటీవ‌లే ఎన్నిక‌ల సంద‌ర్భంగా మాజీ సీఎం కుమారి మాయ‌వ‌తి నేతృత్వంలోని బీఎస్పీలో చేరారు. హ‌త్య‌లు, కిడ్నాప్ ల‌కు పాల్ప‌డిన‌ట్లు వివిధ పోలీస్ స్టేష‌న్ ల‌లో కేసులు న‌మోద‌య్యాయి ముఖ్తార్ అన్సారీపై.

ఆయ‌న మ‌ర‌ణ‌వార్త తెలియ‌డంతో బందా ఆస్ప‌త్రి చుట్టూ జ‌నం గుమిగూడారు. దీంతో భారీ ఎత్తున భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌ను మోహ‌రించారు. ఇదిలా ఉండ‌గా ముఖ్తార్ అన్సారీ సోద‌రుడు అఫ్జ‌ల్ అన్సారీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. త‌న సోద‌రు ముఖ్తార్ అన్సారీ గుండె పోటుతో చ‌ని పోలేద‌ని , ఆహారంలో విషం క‌లిపార‌ని, అందుకే చ‌ని పోయాడ‌ని ఆరోపించారు.

మార్చి 13న 1990లో ఆయుధాల లైసెన్స్ పొందేందుకు న‌కిలీ ప‌త్రాలు ఉప‌యోగించిన కేసులో అన్సారీకి యావ‌జ్జీవ కారాగార శిక్ష ప‌డింది.