NEWSTELANGANA

కావ్య‌..కేకే బిగ్ షాక్

Share it with your family & friends

బీఆర్ఎస్ కు గుడ్ బై

హైద‌రాబాద్ – నిన్న‌టి దాకా అధికారం చెలాయించిన గులాబీ బాస్ కేసీఆర్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. ఒక‌రి వెంట మ‌రొక‌రు నేత‌లు క్యూ క‌డుతున్నారు. వ‌ల‌స బాట ప‌డుతున్నారు. కొంద‌రు బీఆర్ఎస్ నేత‌లు కాషాయ జెండా క‌ప్పుకుంటే మ‌రికొంద‌రు హ‌స్తం గూటికి చేరుతున్నారు.

వ‌రంగ‌ల్ నుంచి ఎంపీ టికెట్ కేటాయించిన క‌డియం కావ్య గుడ్ బై చెప్పింది. తాను పోటీ నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా ఆమె కీల‌క లేఖ రాసింది. బీఆర్ఎస్ నేత‌ల మోసాలను ఉద‌హ‌రించారు. ఆమె చేసిన కామెంట్స్ క‌ల‌క‌లం రేపుతున్నాయి. ప్ర‌స్తుతం స్టేష‌న్ ఘ‌ణ‌పూర్ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన , మాజీ డిప్యూటీ సీఎం క‌డియం శ్రీ‌హ‌రి కూతురే ఈ క‌డియం కావ్య‌.

త‌న‌తో పాటు తండ్రి కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్న‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా ఉన్న‌ట్టుండి నిన్న‌టి దాకా కేసీఆర్ త‌ర్వాత రెండో ప్లేస్ లో కొన‌సాగుతూ వ‌చ్చిన రాజ్య‌స‌భ ఎంపీ గా ఉన్న కే కేశ‌వ‌రావు తో పాటు త‌న కూతురు మేయర్ గ‌ద్వాల విజ‌య‌లక్ష్మి కూడా జంప్ అయ్యేందుకు రెడీ అయ్యారు.

కేసీఆర్ ను క‌లిసిన అనంత‌రం కేశ‌వ‌రావు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తాను బీఆర్ఎస్ వీడుతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. తాము రాజీనామా చేస్తున్న‌ట్లు వెల్ల‌డించ‌డం విశేషం.