అన్సారీ మృతిపై షాకింగ్ కామెంట్స్
ఇప్పుడు నిజమైన హోలీ జరుగుతోంది
ఉత్తరప్రదేశ్ – కరడుగట్టిన గ్యాంగ్ స్టర్, పొలిటిషియన్ ముఖ్తార్ అన్సారీ మృతి చెందడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంబురాలు కొనసాగుతున్నాయి. అన్సారీ కారణంగా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్న వారు, హత్యకు గురైన వారి కుటుంబీకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ప్రధానంగా భారతీయ జనతా పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే కృష్ణా నంద్ రాయ్ ను దారుణంగా హత్య చేశారు. దీని వెనుక ప్రధాన సూత్రధారి ముఖ్తార్ అన్సారీ ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఈ సందర్బంగా అతడు మృతి చెందాడని తెలుసుకున్న వెంటనే తీవ్రంగా స్పందించారు మాజీ ఎమ్మెల్యే, దివంగత రాయ్ భార్య అల్కా రాయ్. ఆమె శుక్రవారం జాతీయ మీడియాతో మాట్లాడారు.
నేను ఏం మాట్లాడాలి. ఒక కరుడుగట్టిన హంతకుడు చనిపోతే ఎందుకు స్పందించాలి. ఇదంతా ఆ దైవం ఆశీర్వాదం అని తాను నమ్ముతానని అన్నారు అల్కా రాయ్. న్యాయం చేయమంటూ ప్రతి రోజూ దేవుడిని ప్రార్థించానని , ఇవాల్టితో తనకు ప్రశాంతత చేకూరిందన్నారు.
తన భర్త చని పోయినప్పటి నుంచి నేటి దాకా హోలీ జరుపు కోలేదన్నారు. ఇప్పుడు నిజమైన హోలీ వచ్చిందని పేర్కొన్నారు.