ముఖ్తార్ కు ములాయం సపోర్ట్
అందుకే రాజీనామా చేశానన్న సింగ్
లక్నో – ఉత్దర ప్రదేశ్ లో కరుడుగట్టిన గ్యాంగ్ స్టర్ గా, పొలిటికల్ లీడర్ గా పేరు పొందిన ముఖ్తార్ అన్సారీ గుండె పోటుకు గురై మరణించాడు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బాధితులు సంతోషం వ్యక్తం చేస్తుండగా ఇదంతా కావాలని సర్కార్ పన్నిన కుట్రలో భాగంగానే తన సోదరుడు చని పోయాడంటూ అఫ్జల్ అన్సారీ సంచలన ఆరోపణలు చేశారు.
ఇదిలా ఉండగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాయ్ ను పట్ట పగలే దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన వెనుక ముఖ్తార్ అన్సారీ హస్తం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. దీనిపై తీవ్రంగా స్పందించారు బాధితుడి భార్య అల్కా రాయ్. దేవుడు కరుణించాడని, ఇవాళ అసలైన హోలీ జరుపుకుంటానని ప్రకటించారు.
కాగా గ్యాంగ్ స్టర్ , పొలిటికల్ లీడర్ అన్సారీ మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ డీఎస్పీ శైలేంద్ర సింగ్. 20 ఏళ్ల కిందట 2004లో అన్సారీ సామ్రాజ్యం పెరిగి పోయిందన్నారు. కర్ఫ్యూ విధించిన ప్రాంతాలలో ఓపెన్ జీపులో తిరిగే వాడని గుర్తు చేశారు.
ఆ సమయంలో తాను లైట్ మెషిన్ గన్ ను స్వాధీనం చేసుకున్నానని చెప్పారు. శుక్రవారం శైలేంద్ర సింగ్ మీడియాతో మాట్లాడారు. అతడిపై పోటా విధించానని చెప్పారు. కానీ ఆనాటి ములాయం సర్కార్ ముఖ్తార్ అన్సారీని కాపాడే ప్రయత్నం చేసిందని సంచలన ఆరోపణలు చేశాడు. అతడి దెబ్బకు ఐజీ , డీఐజీ, ఎస్టీఎఫ్ ఎస్పీ బదిలీ అయ్యారని, తాను రాజీనామా చేయాల్సి వచ్చిందన్నాడు శైలేంద్ర సింగ్.