రేవంత్ రెడ్డితో కేకే ములాఖత్
కాంగ్రెస్ లో చేరిక ఖాయం
హైదరాబాద్ – రాష్ట్రంలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మొత్తంగా నిన్నటి దాకా బీఆర్ఎస్ లో కీలకమైన నాయకుడిగా, నెంబర్ 2 అన్న పేరు పొందిన రాజ్య సభ సభ్యుడు కె. కేశవరావు ఉన్నట్టుండి మాట మార్చారు. ఏకంగా మనసు మార్చుకున్నారు. పదేళ్ల పాటు హోదాలను అనుభవించారు. తన అనుభవాన్ని రంగరించి పార్టీ కోసం కృషి చేశానని, కానీ ఫలితం లేకుండా పోయిందని పేర్కొన్నారు.
ఈ మేరకు తనను కాంగ్రెస్ పార్టీలోకి రావాల్సిందిగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ దీపా దాస్ మున్షీతో పాటు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి స్వయంగా కేకే ఇంటికి వెళ్లి కోరారు. దీంతో పెద్దాయన మనసు తిరిగి కాంగ్రెస్ వైపు మళ్లింది. ఆయన కూతురే ప్రస్తుతం జీహెచ్ఎంసీ మేయర్ గా ఉంది. గద్వాల విజయలక్ష్మితో కలిసి కేశవరావు శుక్రవారం సీఎం ఎనుముల రవేంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు.
ఆయనతో కాసేపు ముచ్చటించారు. ఈ సందర్బంగా పార్టీ పరంగా కీలకమైన పదవి కేకేకు దక్కనున్నట్లు సమాచారం. మొత్తంగా కేకేతో పాటు స్టేషన్ ఘణపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న కడియం కావ్య కూడా జంప్ అవుతుండడం విశేషం.
దీంతో బీఆర్ఎస్ లో ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ , బీజేపీలో చేరేందుకు క్యూ కట్టడం విస్తు పోయేలా చేస్తోంది.