తమిళులంతా మోదీ వైపే
బీజేపీ చీఫ్ కె. అన్నామలై
శ్రీపెరంబూదుర్ – గతంలో కంటే ఈసారి అత్యధిక సీట్లు కైవసం చేసుకోబోతున్నామని చెప్పారు బీజేపీ చీఫ్ కె. అన్నామలై. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం శ్రీ పెరంబూదురులో జరిగిన రోడ్ షోలో పాల్గొన్నారు. ఎన్డీయే తరపున బరిలో ఉన్న తమిళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీఎన్ వేణుగోపాల్ కు మద్దతుగా ప్రచారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్డీయే కూటమి గెలుపొందడం ఖాయని జోష్యం చెప్పారు. ఈసారి తమ లక్ష్యం 400 కు పైగా సీట్లను కైవసం చేసుకోవడం అని చెప్పారు కె. అన్నామలై.
తాము 2019లో జరిగిన ఎన్నికలలో ఇచ్చిన హామీలను అన్నింటిని అమలు చేయడం జరిగిందని చెప్పారు. కానీ డీఎంకే చీఫ్ , సీఎం ఎంకే స్టాలిన్ 511 హామీలు ఇచ్చారని వాటిలో 20 కూడా అమలు చేయలేదంటూ సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తమ అభ్యర్థులకు ఢోకా లేదని, అభివృద్ది అంటే ఏమిటో ఎలా ఉంటుందో చేసి చూపిస్తామని చెప్పారు. సమర్థవంతమైన నాయకుడిగా మోదీ ప్రపంచ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారని, ఇంతకంటే ఇంకేం కావాలని ప్రశ్నించారు కె. అన్నామలై. ఆర్థిక ర్యాంకింగ్స్ లో ఇండియా 11వ స్థానం నుంచి 5వ స్థానానికి చేరుకుందన్నారు. ఇదంతా మోదీ చలవ వల్లనే జరిగిందన్నారు.