షారుక్ ఖాన్ పై కంగనా సెటైర్
సినిమాలు ఫెయిల్ కావడం సహజం
హిమాచల్ ప్రదేశ్ – ప్రముఖ వివాదాస్పద బాలీవుడ్ నటి, ప్రస్తుత భారతీయ జనతా పార్టీ మండి లోక్ సభ నియోజకవర్గ అభ్యర్థి కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె మరో బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
శుక్రవారం మీడియా అడిగిన ప్రశ్నకు సీరియస్ గా సమాధానం ఇచ్చారు. మీరు నటించిన సినిమాలు ఈ మధ్యన బాగా ఆడడం లేదు. అందుకే రాజకీయాల్లోకి వచ్చారా అన్న ప్రశ్నకు రివర్స్ సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు.
గత 10 ఏళ్లుగా ఖాన్ దాదా సినిమాలు ఏవీ ఆడలేదు. చివరకు డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో వచ్చిన జవాన్ హిట్ అయ్యింది. అంతకు ముందు వచ్చిన పఠాన్ గట్టెక్కించింది. అయినంత మాత్రాన ఫెయిల్యూర్ అని చెప్పగలరా అంటూ నిలదీసింది.
నా సినిమాలు కూడా ఏడెనిమిది ఏళ్లు ఆడ లేదని , ఆ తర్వాత క్వీన్ బాగా ఆడిందన్నారు. మణికర్ణిక బిగ్ సక్సెస్ గా నిలిచిందన్నారు. త్వరలో పొలిటికల్ నేపథ్యంతో నటించిన ఎమర్జెన్సీ వస్తోందని బహుశా హిట్ కావచ్చని చెప్పారు కంగనా రనౌత్.